ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడితే 60 లోనూ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది!

తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.వయసు పైబడే కొద్ది జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

 Best Oil For Black And Shiny Hair! Black Hair, Shiny Hair, Hair Care, Hair Care-TeluguStop.com

దీంతో జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.కానీ కొందరి జుట్టు మాత్రం వయసు పైబడిన సరే నల్లగా మెరుస్తుంది.

అలాంటి వారి జుట్టు చూసినప్పుడు కాస్త అసూయ కలగడం సర్వసాధారణం.కానీ మీరు కూడా అలాంటి జుట్టును పొందాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వాడాల్సిందే.

ఈ ఆయిల్ ను వాడితే 60 లోనూ మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఎండిన కరివేపాకు( Curry Leaves ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్మేరీ, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె, అర గ్లాసు బాదం నూనె వేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Oil, Long, Melanin, Shiny, Thick, White-Telugu He

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి స్లో ఫ్లేమ్ పై పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ప‌న్నెండు గంటల పాటు అలా వదిలేయాలి.అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని.ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Oil, Long, Melanin, Shiny, Thick, White-Telugu He

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే మెలనిన్( Melanin ) ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో అరవైలోనూ మీ జుట్టు నల్లగా మెరుస్తుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.దీంతో జుట్టు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube