నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి 42 రోజులు దాటితే 52 రోజుల్లో 45,642 కాటన్ల లిక్కర్, 61,737 కేసుల బీర్ల విక్రయం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తాజాగా గురువారం ఓ వైన్స్ నుంచి బస్తాలో లిక్కర్ ను తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైన్స్ వ్యాపారులు ఎక్సైజ్ రూల్స్ ను తుంగలోతొక్కి కస్టమర్లకు అధికమొత్తంలో లిక్కర్,బీర్లు బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారా? లేక ఎక్కడైనా డంప్ చేస్తున్నారా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.లిక్కర్,బీర్లు కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ కు బిల్ ఇవ్వాలన్న రూల్ ఉన్నా వైన్స్ వ్యాపారులు ఏనాడు అమలు చేసింది లేదు.ఎక్సైజ్ ఆఫీసర్లు సైతం కస్టమర్లకు రశీదు ఇచ్చే విషయమై పట్టించుకున్నది లేదు.
ఇదే అదునుగా వైన్స్ వ్యాపారులు లిక్కర్ స్టాక్, సేల్స్ రికార్డులను తారుమారు చేసి,తమ పరిధిలో ఉన్న బెల్టు షాపులకు,ఎన్నికల సమయం లోనూ గుట్టుగా అడ్డగోలుగా లిక్కర్ సప్లై చేశారనేది బహిరంగ రహస్యం.సాధారణ రోజుల్లో 50 నుంచి 60 శాతం లిక్కర్ బెల్ట్ షాపులోనే సేల్ అవుతున్నట్లు సమాచారం.
1.3 లక్షల కాటన్ల లిక్కర్,బీర్లు సేల్స్…!మిర్యాలగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మిర్యాలగూడ పట్టణ, మండలంతో సహా, వేములపల్లి,దామరచర్ల, మాడుగులపల్లి,అడవి దేవులపల్లిలో కలిపి మొత్తం 26 వైన్స్ లు,టౌన్ లో ఆరు బార్లు ఉన్నాయని ఆఫీసర్లు తెలిపారు.అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఇక్కడి వైన్స్ ద్వారా 45,642 కాటన్ల లిక్కర్, 61,637 కాటన్ల బీర్లు (1,07379) సేల్ అయినట్లు అధికారులు వెల్లడించడం గమనార్హం.అయితే గతనెల అక్టోబర్ 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలై ఈ నెల 21వ తేదీ నాటికి 42 రోజులు దాటింది.
ఈ నేపథ్యంలో అనధికారికంగా నిర్వహించే బెల్ట్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలోనూ సదరు లోకల్ వైన్స్ వ్యాపారులు సాధారణ రోజుల మాదిరిగానే లిక్కర్ సేల్స్ చూపించడంపై అనుమానం కలుగుతుంది.
వారి లెక్కల ప్రకారం నిత్యం 49,254 వేల మందికి పైగా లిక్కర్ సేవించిండ్రా?గుట్టుగా స్టాక్ డంప్ చేసిండ్రా? అనేది వెయ్యిడాలర్ల ప్రశ్నగా మారింది.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో 2,31,391 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో 113,911 మంది పురుష ఓటర్లు ఉన్నారు.స్థానికేతరులు లోకల్ కు వచ్చి తాగే వారిని కలుపుకుంటే 1.35 లక్షల మంది మద్యం సేవిస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.అక్టోబర్ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు5,47,707 ఫుల్ బాటిల్స్,7,40,844 బీర్లు అమ్మినట్లు లోకల్ ఎక్సైజ్ అధికారులు వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.సగటున 2 బీర్లు,4 క్వార్టర్లను నిత్యం 49,254 మంది 52 రోజుల పాటు 25.61లక్షల మంది సేవించినట్లు లిక్కర్ సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఈ లెక్కన నిత్యం 40 శాతం మంది లోకల్,18.7 శాతం మందికి పైగా నాన్ లోకల్ ప్రజలు 58.7 శాతం మంది లిక్కర్ ను సేవించారా లేక అక్రమంగా గుట్టుగా డంప్ చేసిండ్రా అనేది సేల్స్ బిల్లులను పరిశీలిస్తే లిక్కర్ విక్రయ బాగోతం బయటపడనుంది.ఉన్న ఓటర్లలో సగం మందికి పైగా కనీసం రెండు బీర్లు, ఒక క్వార్టర్ ను రెగ్యులర్ గా తీసుకుంటున్నట్టు ఉన్న లెక్కలు,మద్యం అక్రమ విక్రయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.
రూల్స్ కు విరుద్దంగా తరలిస్తున్న లిక్కర్ ను పట్టుకొని మొత్తం 242 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్ట్ చేసి 6 వెహికిల్స్ ను సీజ్ చేసినట్లు లోకల్ ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు సాగుతున్నాయని చెప్పడం కొసమెరుపు.