బీట్ రూట్( Beet root ).ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ బీట్ రూట్ లో ఉంటాయి.అందుకే చాలా మంది బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తారు.
అయితే బీట్ రూట్ కు బెల్లీ ఫ్యాట్( Belly fat ) ను కరిగించే సత్తా కూడా ఉందని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.ఇటీవల కాలంలో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.అలాంటి వారు ప్రతిరోజు ఉదయం బీట్ రూట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు మరియు కొన్ని వాటర్ వేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించిన బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ), అర కప్పు తరిగిన ఫ్రెష్ కొత్తిమీర( Coriander
), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ కలిపి సేవించాలి.రోజు ఉదయం ఈ విధంగా బీట్ రూట్ జ్యూస్ ను తయారు చేసి కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.క్యాన్సర్ కణాల విభజన మరియు పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం కూడా ఈ జ్యూస్ కు ఉంది.