ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.జుట్టు రాలిపోవడం, జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారడం, చుండ్రు, పొడి జుట్టు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఇలా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు( curry leaves ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది.అలాగే మెంతాకు( fenugreek leave ) లో కూడా జుట్టుకు మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి.
కరివేపాకు మెంతాకు కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తలకు రాశారంటే హెయిర్ ఫాల్ తో సహా అనేక జుట్టు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు మరియు ఒక కప్పు మెంతాకు వేసుకుని వాటర్ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla powder ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.
ముఖ్యంగా మెంతాకు, కరివేపాకు, ఆమ్లా పౌడర్ మరియు పెరుగు బలహీనంగా ఉన్న జుట్టు కుదుళ్ళను దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలను నివారిస్తాయి.చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.స్కాల్ప్ తేమగా ఆరోగ్యంగా మారుతుంది.

అంతేకాకుండా ఈ రెమెడీ హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగే ప్రోత్సహిస్తుంది.మరియు తెల్ల జుట్టు త్వరగా దరిచేరకుండా సైతం అడ్డుకుంటుంది.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన నల్లని కురులను కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.