సాధారణంగా కొందరి జుట్టు గ్రే కలర్(బూడిద రంగు) లోకి మారి పోతుంటుంది.వాతావరణంలో మార్పులు, పోషకాల లోపం, దుమ్ము, ధూళి, వృద్ధాప్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల వాడకం ఇలా రకరకాల కారణంగా వల్ల జుట్టు గ్రే కలర్‌లోకి ఛేంజ్ అయిపోతుంది.
దాంతో ఏం చేయాలో తెలియక.జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో అర్థంగాక నానా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.సులభంగా బూడిద రంగులోకి మారిన జుట్టును నల్లగా, షైనీగా మార్చుకోవచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
బంగాళదుంప తొక్కలు జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ముందుగా బంగాళదుంప తొక్కలను నీటిలో వేసి బాగా ఉడికించి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఉల్లి రసం మిక్స్ చేసి తలకు, కేశాలకు పట్టించాలి.
అర గంట తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ్రే హెయిర్ బ్లాక్‌గా మారుతుంది.
అలాగే గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె పోసి అందులో కలబంద ముక్కలు, గుప్పెడు కరివేపాకు, ఐదారు మందారం ఆకులు వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత నూనెను వడబోసుకుని.గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి.ఈ నూనెను ప్రతి రోజు తలకు అప్లై చేసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది.
ఇక మెంతి ఆకులతో కూడా గ్రే హెయిర్‌ను నివారించు కోవచ్చు.మెంతి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.
అందులో కొద్ది నిమ్మ రసం యాడ్ చేసి తలకు పట్టించాలి.ముప్పై, నలబై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేసినా.జుట్టు నల్లగా, షైనీగా మారుతుంది.