నల్లగొండ జిల్లా: అర్హతగల ప్రతి జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు,అక్రిడిటేషన్ కార్డులు వస్తాయని, ఎవరైనా మీడియా పేరు చెప్పుకొని తప్పుడు పనులు చేస్తే సహించేది లేదని తెలంగాణ మీడియా అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి అన్నారు.నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో టియుడబ్ల్యూజేఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలు తెలిపే వారే నిజమైన జర్నలిస్టులని, ఏదో కొందరిని పేర్లు ప్రచురిస్తూ వారిని సంతోష పెట్టేందుకు రాసే రాతలు కరెక్టు కాదని,నిజమైన విలేకరుల లక్షణం అది కాదని స్పష్టం చేశారు.గ్రామస్థాయి జర్నలిస్టు నుండి ప్రతి సమస్యని, హెల్త్ కార్డుల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు.
అనంతరం ఎమ్మేల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.
విలేకరులమని ఎవరినైనా బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తే వారు ఎంతటి వారైనా చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరించారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహమత్ అలీ మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు వస్తాయని, అనవసరమైన విషయాలకు తప్ప మిగతా వాటికి వాడరాదన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖా రెడ్డి,సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గిరిధర్,మండల అధ్యక్షుడు రాము,కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి, పాత్రికేయులు పాల్గొన్నారు.