ప్రస్తుత సీజన్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది దగ్గు, జలుబు ( Cough, cold )వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఇంట్లో ఒకరికి దగ్గు, జలుబు పట్టుకున్నాయంటే సులభంగా మిగతా వారికి కూడా వ్యాపిస్తాయి.
అయితే కొందరికి జలుబు, దగ్గు చాలా త్వరగా తగ్గిపోతుంటాయి.కానీ కొందరిని మాత్రం అవి ఓ పట్టాన వదిలిపెట్టవు.
ఎన్ని మందులు వాడినా సరే సరైన ఫలితం ఉండదు.పైగా దగ్గు, జలుబు కారణంగా ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.
పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాను మీరు తప్పక తెలుసుకోండి.
ఈ చిట్కాను పాటిస్తే కనుక కేవలం రెండు మూడు రోజుల్లోనే జలుబు, దగ్గు సమస్యలకు బై బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పది మిరియాలు( Pepper ), ఐదు లవంగాలు( cloves ) వేసి మంచిగా వేయించుకొని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మెత్తగా దంచి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్( Ginger juice ) వేసుకోవాలి.అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తేనె( honey ), పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ లవంగాలు మిరియాల పొడి, చిటికెడు పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజుకు రెండు పూటలా తీసుకోవాలి.
మిరియాలు, లవంగాలు, పసుపు, తేనె, అల్లం.వీటన్నిటిలోనూ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి.
ఇవి జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడతాయి.చాలా వేగంగా ఆయా సమస్యలను తరిమికొడతాయి.అదే సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.
అనేక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.కాబట్టి జలుబు దగ్గు అస్సలు తగ్గడం లేదు అని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ చిట్కాను ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.