నల్లగొండ జిల్లా:సమాజంలో ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని నాగార్జునసాగర్ సీఐ శ్రీను నాయక్ అన్నారు.సోమవారం సాగర్ పోలీస్ స్టేషన్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కటెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో “ట్రైన్ యువర్ టంగ్”అనే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు విజయ్చే నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వృత్తిలో రాణించడానికి,
ఉన్నతమైన ప్రతిభ కనబరచడానికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమన్నారు.సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు అడ్వకేట్ క్టటబోయిన అనిల్ కుమార్ సేవలు అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సంపత్,వీరశేఖర్,వీరబాబు, ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు,పీసీలు తదితరులు పాల్గొన్నారు.







