సూర్యాపేట జిల్లా: చింతలపాలెం పోలీసుస్టేషన్ ఎస్‌ఐ అంతిరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పర్మినెంట్ ఎస్ఐ లేక మండలంలో చిన్నా చితకా కేసులకు కూడా కోదాడ లేదా మేళ్లచెరువుకు వెళ్లాల్సి వస్తుందని,శాంతిభద్రతల పర్యవేక్షణ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







