నల్లగొండ జిల్లా:వాట్సాప్ నుంచి సిగ్నల్,టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు.దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు.
దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు.ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా,విడిగా ఒక చాట్ ఇన్‌ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధం చేస్తోంది.
ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది.వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్,టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టం చేసింది.