ఉద్యమం తెలువని మూర్ఖులు, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర నేత డా.బక్కతట్ల వెంకట్ యాదవ్ అన్నారు.
సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో అందుబాటులో ఉన్న జాగృతి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఒక విశిష్టత ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేకమంది మేధావులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారరన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాతనో,కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనో,తెలంగాణ తల్లి విగ్రహాం రూపుదిద్దుకోలేదన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గమనించాలన్నారు.యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి లక్షలాది దండలు వేసిన విషయాన్ని ఈ పాలకులు గుర్తెరగాలన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మారుస్తున్నారో,అందులో ఉన్నటువంటి లోపాలు ఏమిటో వ్యక్తపరచకుండా కేసీఆర్ పైన ఉన్న ఆక్కస్సుతో రేవంత్ రెడ్డి ఇలాంటి సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు.రేవంత్ రెడ్డి ఐడెంటిటీ కోసమే తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపం మారుస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుందన్నారు.
ఉద్యమ కాలంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల వద్దకు వెళ్లడానికి చర్చకు సిద్ధమా అని అన్నారు.ప్రపంచానికే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అయిన బతుకమ్మ పండుగను చాటి చెప్పిన తెలంగాణ బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో నుండి తీసివేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలన్నారు.
ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపానికి శిల్పకళా నైపుణ్యం లేదన్నారు.ప్రతి బతుకమ్మ పండుగకు కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతికి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేసి కేసీఆర్ ఆడబిడ్డల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచిందన్నారు.తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ బోనాలను, తెలంగాణ బతుకమ్మ పండుగను,తెలంగాణ ఆటపాటలను అంతర్జాతీయ స్థాయిలో కీర్తింపచేసి.
తెలంగాణ సంస్కృతిపై గొప్ప చర్చను బట్టి ఒక సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత తెలంగాణ జాగృతికి,బారాసకు దక్కుతుందన్నారు.అంగరంగ వైభవంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయిన విగ్రహం లాగా తయారు చేయడం ఏ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని అన్నారు.
తెలంగాణ ఆడబిడ్డలు అంగరంగ వైభవంగా ముస్తాబై తెలంగాణ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటున్న సంగతి ఈ పాలకులకు తెలియదా అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది పాలనలో తీసుకొచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ తెలంగాణ అమరవీరుల త్యాగాలకు నిదర్శనంగా సాగర తీరాన పెద్ద ఎత్తున అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మించిన సంగతి ఈ పాలకులు యాది మరువద్దన్నారు.ఉద్యమం తెలవని,ఉద్యమం పట్ల అవగాహన లేని వారు పీఠంపై కూర్చుంటే తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసమే జరుగుతుంది తప్ప మార్పు రాదన్నారు తెలంగాణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా కేసిఆర్ ప్రభుత్వం ఏమి మార్పులు తీసుకొచ్చిందో వాటిని కనుమరుగు చేసే కుట్రలకు ఈ ప్రభుత్వం తెర లేపుతుందే తప్ప నూతన అభివృద్ధి నమూనాలను ఏమి రూపొందించడం లేదన్నారు
.