మానవ హక్కుల వేదిక 10వ,రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా:డిసెంబర్ 14,15 తేదీల్లో అనంతపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక 10వ,రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షుడు అక్కేనపల్లి వీరాస్వామి పిలుపునిచ్చారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ “ప్రతి మనిషికీ ఒకే విలువ” అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన పిలుపుని మా సంస్థ మూడవ మహాసభలోనే అంతర్లీనం చేసుకుందని,బుద్ధుడి నుండి అంబేడ్కర్ వరకు మానవహక్కుల దేశీయ మూలాలు వెతుక్కుంటూ, దేశ,విదేశాలలో జరిగే హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నించడం,వాటి గురించి పోరాడడం మానవ హక్కుల ఉద్యమ కర్తవ్యం అని,ఆ కర్తవ్యాన్ని ఈ మహాసభలలో పునరుద్ఘాటిస్తామన్నారు.

 Human Rights Forum 10th, State Conference Pamphlet Inauguration , Mandra Mallaya-TeluguStop.com

ఈ మహాసభల్లో ప్రధానంగా కులగణన ఎందుకు అవసరం,బస్తర్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు,ఎన్ఈఎఫ్ 2020,కాషాయికరణ, కార్పొరేటీకరణ అంశాలపై సామాజిక విశ్లేషకులు ఎస్.ఎన్.సాహు,మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్,స్వతంత్ర విలేఖరి ఓఎస్టి మాలిని సుబ్రహ్మణ్యం,చరిత్ర విశ్రాంత అధ్యాపకులు కొప్పర్తి వెంకటరమణ మూర్తి ప్రసంగిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు చింతమల్ల గురువయ్య, బిఎంఎస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాండ్ర మల్లయ్య యాదవ్, న్యాయవాదులు దరావత్ వీరేష్,బి.

గోపి,కె.చంద్రకాంత్,బి.వేణు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube