రూ.1.28 కోట్లు పట్టుకున్న రైల్వే పోలీసులు

నల్లగొండ జిల్లా:ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.28 కోట్ల నగదును నల్లగొండ జిల్లా ఆర్‌పీఎఫ్‌,రైల్వే పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే…నల్లగొండ మిర్యాలగూడకు చెందిన బంగారం వ్యాపారి హైదరాబాద్‌లో బంగారం కొనుగోలు చేసేందుకు తన వర్కర్‌తో కలిసి ఫలక్‌ నామా ఎక్స్ ప్రెస్ లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రెండు బ్యాగుల్లో నగదును తీసుకెళ్తున్నారు.రైలులో వారు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు బ్యాగులు తనిఖీ చేయగా రూ.1,28,41,800 నగదు ఉన్నట్లు గుర్తించారు.వారిని అదుపులోకి తీసుకుని,నగదు స్వాధీనం చేసుకొని,ఐటీ అధికారుల సహాయంతో నగదును నల్లగొండ రైల్వే స్టేషనలో లెక్కించారు.ఈ నగదును ట్రెజరీ కార్యాలయానికి తరలించి అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు.

 Railway Police Seized Rs.1.28 Crores, Rs.1.28 Crores, Railway Police, Mahender,-TeluguStop.com

ఈ నగదు విషయానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఉండడంతో వివరాలు వెల్లడించేందుకు ఆలస్యం అవుతుందని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తెలిపారు.అయితే మిర్యాలగూడలో బంగారం దుకాణాల మధ్య ఉన్న పోటీతత్వంతో ఇతర వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు నగదును ఆర్‌పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మహేందర్‌, పరమే్‌షకు చెందిన నగదుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube