గ్రామసభలో ప్రత్యేకాధికారి కి విన్నపం.రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో గల సర్వే నంబర్ 24,25,26 లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (డేలి వేజ్)కూరగాయల మార్కెట్ కు కేటాయించాలని గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు కోరారు.ఎల్లారెడ్డిపేట గ్రామ సభ ప్రత్యేకాధికారి సత్తయ్య అధ్యక్షతన జరిగింది.రేషన్ దుకాణాల్లో బియ్యం తక్కువ తూకం వేస్తున్నారని వాటిపై పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు.
గ్రామ సభకు మండల తహశీల్దార్ కార్యాలయం అధికారులు ఎందుకు రాలేదని,సెస్ అధికారులు ఎందుకు రావడం లేదని మీరు సమాచారం ఇవ్వలేదా? ఇచ్చిన కానీ అధికారులు ఎందుకు రాలేదని గ్రామ సభలో ప్రశ్నించారు.కిష్టంపల్లి లో,డబల్ బెడ్ రూం లలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక్కో రేషన్ దుకాణం దారుడిని అక్కడ నియమించాలని ఇలా చేయడం వల్ల బియ్యం తెచ్చుకునే వారికి ఆటో ఖర్చులు తప్పుతాయని ఈ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
కిష్టం పల్లి లో పల్లె దవాఖానా నిర్మాణం జరుగుతుందని అక్కడ సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ గ్రామ ప్రత్యేకాధికారి నీ కోరారు.గ్రామ పంచాయతీ హెల్పర్లు సరిగా పని చేయడం లేదని వారు సక్రమంగా పనిచేసేలా చూడాలని కోరారు.
పల్లె ప్రకృతి వనానికి వెళ్ళే దారిలో పెద్ద గుంత డ్రైనేజ్ పై ఉందని ఎవరైనా అందులో పడితే ఎవరు భాధ్యత వహిస్తారనీ వెంటనే డ్రైనేజ్ పై స్లాబ్ వేయాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.సెస్ అధికారులు గ్రామ సభకు ఎందుకు రాలేదని గ్రామ ప్రజలు ప్రశ్నించారు.
అసలు గ్రామ సభకు గ్రామ సభ ఉందని ఎందుకు చాటింపు చేయలేదని అధికారులను గ్రామస్థులు ప్రశ్నించారు.ఈ గ్రామ సభలో గ్రామ ప్రత్యేకాధికారి సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి దేవరాజు, ఎంపీటీసీ నాగరాణి, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సందీప్,మాజీ వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీ నారాయణ, ఏ ఎన్ ఎం లు,ఆశా వర్కర్లు, ఆంగన్ వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాద్యాయులు, గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ కటకం రామచంద్రం తో,పాటు గ్రామస్థులు పాల్గొన్నారు
.