సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు - టెస్కో జీఎం అశోక్ రావు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సోమవారం అందజేశారు.

 Steps Taken For The Development Of Sirisilla Textile Industry Tesco Gm Ashok Rao-TeluguStop.com

ఈ సందర్భంగా టెస్కో జీఎం అశోక్ రావు మాట్లాడారు.ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ముందుగా ఒక చీరను ( అందరికీ ఒకే రంగు చీర) ఆర్డర్స్ దాదాపు 4.24 కోట్ల మీటర్లు అందజే సిందని వెల్లడించారు.ఈ చీరలను ఈ ఏప్రిల్ 30 వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించాలని సూచించారు.వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని తెలిపారు.ఆధునిక, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు.ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube