రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో హన్మాజిపేట హై స్కూల్ విద్యార్థుల లతో రహదారి భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది అని వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఎస్ ఐ మాట్లాడుతూ విద్యార్థుల కు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత అవగాహన ఇప్పటి నుండి కలిగి ఉండాలి అనే ఉద్దేశ్యం తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని,
మద్యం తాగి వాహనాలు నడపవద్దు అని, రాంగ్ రూట్ లో వాహనం నడపటం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు అని, రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని, మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితి లో వాహనాలు నడపవద్దు అని వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లి తండ్రులు కూడా చట్ట రీత్యా శిక్షార్హులు అవుతారు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో వేములవాడ రూరల్ మండల ఎం ఈ వో కిషన్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.