అగ్ని మాపక వారోత్సవాలు ముగింపు

వారం పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అగ్ని మాపక వారోత్సవాలు ముగిశాయని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరసింహచారి ఒక ప్రకటనలో తెలిపారు.ఏప్రిల్ 14, 1944 సంవత్సరంలో విక్టోరియా డాక్ యార్డ్ లో ఒక నౌక లో అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో మరణించిన 66 మంది అగ్ని మాపక సిబ్బంది స్మారకార్థం వారికి ఈ నెల 14వ తేదీన నివాళులు అర్పించామని పేర్కొన్నారు.తమ శాఖ రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్స్, స్టికర్స్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారని గుర్తు చేశారు.15 వ తేదీన జనాల రద్దీ ఎక్కువగా ఉండే సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద, అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై డెమో నిర్వహించామని తెలిపారు.ఈ నెల 16వ తేదీన జిల్లా లోని అపార్ట్మెంట్స్ లో సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు, మంటలు అంటుకుంటే ఆర్పే విధానంపై తెలియజేశామని పేర్కొన్నారు.ఈ నెల 17వ తేదీన హాస్పిటల్లో, 18 న పరిశ్రమలు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, సిలిండర్ల గోడౌన్ ల వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై వివరించామని, 19న దుకాణాల వద్ద అవగాహన కల్పించామని తెలిపారు.

 End Of Fire Extinguisher Weeks , Fire Extinguisher Weeks, Victoria Dock Yard-TeluguStop.com

మంటలు ఆర్పివేసే పరికరాల వినియోగంపై ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వివరించాలని, అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube