కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు గ్రామాల్లో అధికారుల బృందం తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా, నీటి సమస్య రాకుండా కార్యాచరణ సిద్దం చేయనున్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరాను పరిశీలించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 1 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు.షెడ్యూల్ విడుదల.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇటీవల జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, మిషన్ భగీరథ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి.? నీటి సరఫరా ఫై ఆరా తీశారు.వేసవి కాలం దృష్యా జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీటి సరఫరాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని, ఈ మేరకు ఆయా మండలాల వారీగా పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ అధికారులతో ఒక బృందాన్ని వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీటి సరఫరాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని షెడ్యూల్ విడుదల చేశారు.అధికారుల బృందం సమస్యలను గుర్తించి, వాటిఫై నివేదిక అందజేయాలని సూచించారు.
దీంతో రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళేలా కార్యాచరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిద్దం చేయనున్నారు
.