అధికార పార్టీ సర్పంచ్ కు అందని రైతు భీమా

నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలములొని రాగట్ల పల్లి మాజీ సర్పంచ్ మందాటి రాజు యాదవ్ జూన్ 13 న రాత్రి ఎల్లారెడ్డిపేట నుండి తన స్వగ్రామం రాగట్లపల్లి వైపు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజు యాదవ్ ను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.రాజు యాదవ్ చనిపోయి మూడు నెలలు పూర్తయిన ఇంతవరకు రైతు భీమా అందలేదు.

 Ruling Party Sarpanch Does Not Get Farmer Insurance-TeluguStop.com

రైతు భీమా కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగిన ఇంతవరకు రైతు భీమా అందలేదు.ఒక అధికార పార్టీ సర్పంచ్ చనిపోతెనే రైతు భీమా అందడం లేదు అంటే సాధారణ రైతు పరిస్ఠితి ఏంటని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అంతే కాకుండా ఏదేని ప్రమాదంలో మరణించిన వారికి పార్టీ తరపున అందించే పార్టీ ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు సైతం బాధిత కుటుంబానికి అందడం లేదు.మృతునికి భార్య రమ్య , కుమారులు హరిచరన్, సాయి, సాకేష్ లు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందించాలని రాజు కుటుంబ సభ్యులు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube