పటాస్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయినటువంటి ఫైమా( Faima ) అనంతరం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈమె అతి తక్కువ సమయంలోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా లేడీ కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినటువంటి ఫైమా అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా దాదాపు పది వారాలకు పైగా కంటెస్టెంట్ గా కొనసాగినటువంటి ఈమె ఇక్కడ కూడా తన అద్భుతమైన ఆటతీరుతో మాట తీరుతో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు.
చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను అనుభవించిందని తన తల్లి బీడీలు చుట్టి పెంచి పెద్ద చేసిందని పలు సందర్భాలలో తన కన్నీటి కష్టాలను తెలియజేసిన సంగతి తెలిసిందే.ఎప్పటికైనా తన తల్లికి ఒక సొంత ఇల్లు ( Own House ) ఉండాలన్నదే తన తల్లి కోరిక అని తన తల్లి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని ఈమె తెలిపారు.
ఇలా తన తల్లి కోరికను నెరవేర్చడం కోసం తన తండ్రికి ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫైమా తెలియజేశారు.అయితే తాజాగా తన సొంత ఇంటి కల నెరవేరిందని తెలుస్తోంది.తన సొంత ఇంటి కలతో పాటు తన తల్లి కోరికను కూడా నెరవేర్చారని తెలుస్తుంది.తాజాగా గృహప్రవేశానికి( House warming ) సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా ఈమె నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తన కల నెరవేరినందుకు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఫైమా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నామని కూడా వెల్లడించారు.ఇక కెరియర్ విషయానికి వస్తే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చినటువంటి ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.