కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.ఈ మేరకు రేపు సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
తరువాత సీఆర్పీఎఫ్ ఆఫీసర్ మెస్సెస్ లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.ఇందులో భాగంగానే సోషల్ మీడియా పనితీరుపై నేతలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం.
అనంతరం 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొననున్నారు.ఉత్సవాలు ముగిసిన అనంతరం అమిత్ షా ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.