అధికార పార్టీ సర్పంచ్ కు అందని రైతు భీమా
TeluguStop.com
నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలములొని రాగట్ల పల్లి మాజీ సర్పంచ్ మందాటి రాజు యాదవ్ జూన్ 13 న రాత్రి ఎల్లారెడ్డిపేట నుండి తన స్వగ్రామం రాగట్లపల్లి వైపు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజు యాదవ్ ను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజు యాదవ్ చనిపోయి మూడు నెలలు పూర్తయిన ఇంతవరకు రైతు భీమా అందలేదు.
రైతు భీమా కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగిన ఇంతవరకు రైతు భీమా అందలేదు.
ఒక అధికార పార్టీ సర్పంచ్ చనిపోతెనే రైతు భీమా అందడం లేదు అంటే సాధారణ రైతు పరిస్ఠితి ఏంటని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతే కాకుండా ఏదేని ప్రమాదంలో మరణించిన వారికి పార్టీ తరపున అందించే పార్టీ ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు సైతం బాధిత కుటుంబానికి అందడం లేదు.
మృతునికి భార్య రమ్య , కుమారులు హరిచరన్, సాయి, సాకేష్ లు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందించాలని రాజు కుటుంబ సభ్యులు కోరారు.
ఏపీ టెట్ పరీక్షలో 150కు 150 మార్కులు.. అశ్విని సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!