రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు.సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.
పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని అంకితభావంతో పనిచేస్తారని పటిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకు వెళుతుందని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పనిచేస్తుందని వారు అన్నారు.మండల కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు చెన్ని బాబు మండల కోఆర్డినేటర్ రాజ్ కుమార్,చందు మిర్యాల కార్ ప్రచారంలో పాల్గొన్నారు.