పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు::సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలి పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు ,అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని నవీన్ మిట్టల్ సి.సి.

 Ccla Commissioner Naveen Mittal Took Strong Steps To Resolve The Pending Land Is-TeluguStop.com

ఎల్.ఏ తెలిపారు.శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో పెండింగ్ భూ సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు.

రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు.నవీన్ మిట్టల్ సి.సి.ఎల్.ఏ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజలకు అందుబాటులో ఆన్లైన్ లో పెట్టిందని అన్నారు.నూతన చట్టం ముసాయిదా క్రింద సెక్షన్ 4 ప్రకారం కొత్త ఆర్వోర్ రికార్డ్ రూపకల్పన, అందుబాటులో ఉన్న రికార్డ్ సవరణకు అవకాశం ఉందని, గత చట్టం కింద నిలిచిపోయిన సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సెక్షన్ 6 వెసులుబాటు కల్పించిందని, సిసిఎల్ఏ వెబ్ సైట్ నందు ముసాయిదా బిల్లు అందుబాటులో ఉందని అన్నారు.

ఆర్వోఆర్ ముసాయిదా బిల్లు పై ప్రజలు తమ సలహాలు సందేహాలు, అభిప్రాయాలను సిసిఎల్ఏ వెబ్ సైట్ www.ccla.telangana.gov.in ద్వారా లేదా [email protected] మెయిల్ ద్వారా ఆగస్టు 23 వరకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు సకాలంలో అందజేయాలని సీ.సీ.ఎల్.ఏ కమిషనర్ సూచించారు.ప్రజల నుండి వచ్చిన సూచనలు సలహాలు మేరకు కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీసీఎల్ఏ కమిషనర్ తెలిపారు.నూతన ఆర్వోఆర్ చట్టం అమలులోకి వచ్చే లోపు పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని, మరో 3 వారాల వ్యవధిలో పూర్తి స్థాయిలో ధరణి దరఖాస్తులు పరిష్కారమయ్యే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ధరణి ద్వారా వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ*మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధరణి ద్వారా మొత్తం 3240 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 737 దరఖాస్తులను ఆమోదించామని, 2501 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుతం 969 ధరణి దరఖాస్తుల పెండింగ్ లో ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వద్ద 114 దరఖాస్తులు, అదనపు కలెక్టర్ వద్ద 318 దరఖాస్తులు, రెవెన్యూ డివిజన్ అధికారుల వద్ద 327 దరఖాస్తులు, తహసిల్దార్ లు వద్ద 210 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని , వీటిని సకాలంలో పరిష్కరిస్తామని, తిరస్కరించే దరఖాస్తుల పై తప్పనిసరిగా కారణం తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మండలాల నుండి తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube