దివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం జరగకుండా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలోని దివ్యాంగులకు రుణాల మంజూరు విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, వారు ఉపాధి పొందే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల సాధికారికత కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షత వహించి, పలు అంశాలపై చర్చించారు.

 There Should Be No Delay In Granting Loans To The Disabled District Collector An-TeluguStop.com

దివ్యాంగుల కొరకు బ్యాక్ లాగ్ వేకెన్సీ లు అన్నింటిని త్వరగా భర్తీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.అలాగే శిక్షణ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

అలాగే ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ విషయంలో సదరంలో ఉన్న వివరాలను, పెన్షన్ తీసుకుంటున్న వారి వివరాలను, విద్యాశాఖ నుంచి వివరాలను తీసుకొని అందరికీ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్లు అందేలాగా చూడాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.అలాగే దివ్యాంగులకు ఇచ్చేటువంటి బ్యాంకు లోన్ల విషయంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రతి ఒక్కరికి తొందరగా రుణాలు మంజూరు అయ్యేలాగా చూడాలని ఆదేశించారు.అలాగే జిల్లా పరిశ్రమల కేంద్రం టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారి పరిధిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి దివ్యాంగులకు నైపుణ్యాలు పెంపొందించి వారు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు పొందడానికి కృషి చేయాలని ఆదేశించారు.

అలాగే పోలీస్ స్టేషన్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు సహాయపడడానికి ప్రతి ఒక్కరూ వితోదికంగా కృషి చేయాలని ఆదేశించారు.

అలాగే దివ్యాంగుల పట్ల వివక్షను చూపించకూడదని వారి పట్ల చిన్నచూపు ప్రదర్శించకూడదని వారి పట్ల వివక్ష చూపించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా కార్మికశాఖ అధికారి ఎండీ.

రఫీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, జీసీడీఓ పద్మజ, డీసీపీఓ స్వర్ణలత, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి, కమిటీ సభ్యులు పున్నం చందర్, ఖాజా మోయినొద్దీన్,ఈశ్వర్, మామిడాల నరేష్, కోడం శ్రీనివాస్, మామిడి పరుశురాములు, గోగికారి రాము, తిరుపతి, వినయ్ కుమార్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube