సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం బొజ్జగూడెంతండా గ్రామ బిఎల్ఓ బానోతు వెంకటేశ్వర్లు శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నుండి ఉత్తమ బిఎల్ఓ అవార్డు అందుకున్నారు.
బిఎల్ఓ గా గ్రామానికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేయడం జరిగిందని అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లు తెలిపారు.
వెంకటేశ్వర్లుకు అవార్డు రావడంతో పలువురు నాయకులు,గ్రామస్తులు అభినందించారు.