సూర్యాపేట జిల్లా:టిఆర్ఎస్ నాయకుల ఆవేశమో,అతి ప్రేమో తెలియదు కానీ,ఖబర్ధార్ మోడీ అనబోయి,ఖబర్ధార్ కేసిఆర్ అనేయడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఅర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ఖబర్డార్ మోడీ అనబోయి ఖబర్డార్ కేసీఆర్ అంటూ బిగ్గరగా నినదించారు.దీనితో తేరుకున్న నేతలు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు.
అనంతరం మున్సిపాలిటీ కూడలిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనేందుకు భారీ కుట్రలకు తెరతసిందని ఆరోపించారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు నాట్ ఫర్ సేల్ అంటూ నినదించారు.