సూర్యాపేట జిల్లా: జిల్లాలో జూలై నెలాఖరులో సిఎం కేసీఆర్ పర్యటన వుండవచ్చని తెలుస్తుంది.ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులను, నూతన కార్యాలయాలను సిఎం ప్రారంభిస్తారని తెలుస్తోంది.2017 లో సూర్యాపేట పర్యటన తరువాత, పార్లమెంటు ఎన్నికల సమయంలో కేసీఆర్ సూర్యాపేటకు వచ్చారు.మళ్ళీ ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటనకు రావడంతో ఈ సారి పెద్ద ఎత్తున నూతన భవనాల ప్రారంభోత్సవం జరగనుంది.
ప్రారంభానికి సిద్దమవుతున్న కార్యాలయాలు, భవనాలు ఇవే…/br>
నూతన కలెక్టర్ కార్యాలయం, నూతన ఎస్పి కార్యాలయం,మెడికల్ కాలేజ్,సమీకృత మోడల్ వెజ్,నాజ్ వెజ్ మార్కెట్, వాణిజ్య భవన్ పక్కన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఫేస్ -2 కాలనీలో డబుల్ బెడ్ రూం సముదాయం, జమ్మిగడ్డ మురుగు నీటి శుద్ది కేంద్రం, పైలాన్, మినీ ట్యాంక్ బండ్, ఐలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలుస్తోంది.







