ఈ బార్బీ ఇల్లు మీకు నచ్చిందా? అయితే అక్కడ స్టే చేయొచ్చు తెలుసా?

బార్బీ( Barbie ) గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు.అదే విధంగా బార్బీ మాలిబు డ్రీమ్ హౌస్ గురించి కూడా అందరికీ తెలిసిందే.

 Barbie Malibu Dreamhouse Is A Real Place For Rent On Airbnb Details, Viral News,-TeluguStop.com

గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘బార్బీ’ ఇక్కడే తెరకెక్కించారు.కాగా ఆ ఇల్లు కాస్త సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.

పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా కాలిఫోర్నియాలో( California ) ఈ మాలిబు భవంతి కొలువుదీరింది.బార్బీ అభిమానులు ఎవరైనాసరే ఇందులో నివసించే అవకాశం ఉంది మరి.అయితే, దీనికి ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అవును, ఈ భవనం త్వరలో అద్దెకు అందుబాటులోకి రానుంది.ఇక జులై 17 నుంచి Airbnbలో అద్దె కోసం బుకింగ్ చేసుకోవచ్చు.డ్రీమ్ హౌస్ లో ఒక రోజు ఖర్చు $ 60 మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు.

Airbnb అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఒకసారి పరిశీలిస్తే, జులై 21, 22 తేదీల్లో ఒక్కో గెస్ట్ ఉచితంగా బస చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.అయితే, ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ అవకాశం దక్కనుంది మరి.బార్బీ బొమ్మ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈ భవంతిలో ఉండేందుకు 2019లో Airbnb ఒక రాత్రికి $60 (సుమారు రూ.4,900) వసూలు చేశారు.ఈ సారి కూడా అద్దె అంతే అయినప్పటికీ లక్కీ విన్నర్స్ కు బస ఉచితం అని ప్రకటించారు.

ఇకపోతే, బార్బీ మాలిబు డ్రీమ్ హౌస్( Barbie Malibu Dream House ) సముద్ర తీరంలో 3 అంతస్థులలో చాలా విశాలంగా ఉంటుంది.ఇందులో 2 బెడ్ రూమ్లు, 2 బాత్ రూమ్లు, ఒక స్టూడియో, ఒక వ్యక్తిగత సినిమా హాల్, ఓపెన్ డైనింగ్ హాల్, ఒక ధ్యాన కేంద్రం, ఒక వంటగది ఉన్నాయి.పనోరమిక్ వ్యూతో పాటు, అవుట్ డోర్ డిస్కో డ్యాన్స్ ఫ్లోర్, రోలర్-స్కేటింగ్ రింక్, బార్, ఇన్ఫినిటీ పూల్, తోటి అతిథులతో కొన్ని సరదా కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇంపాలా స్కేట్లు, సర్ఫ్ బోర్డులు అందుబాటులో ఉండనున్నాయి.Airbnb వెబ్సైట్ ప్రకారం, అద్దెకు ఇవ్వగా వచ్చిన డబ్బును నిర్వాహకులు ఛారిటీకి అందివ్వనున్నారు.100కు పైగా దేశాల్లో పిల్లలకు సహాయం చేస్తున్న ‘సేవ్ ది చిల్డ్రన్’ సంస్థకు ఈ అమౌంట్ ను విరాళంగా ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube