1.ఏపీ తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.మరో రెండు రోజుల్లో బంగళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.ఏపీ, తెలంగాణ లో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
2.యునెస్కో జాబితాలో వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో ప్రపంచ గుర్తింపు దక్కింది.గత ఏడాది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందగా, తాజాగా వరంగల్ నగరాన్ని గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ గుర్తించినట్లు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆర్డర్ అజోలే ప్రకటించారు.
3.రాజాసింగ్ అరెస్ట్ పై ప్రభుత్వానికి నోటీసులు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం పై వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
4.ముస్లిం రిజర్వేషన్ పై ప్రధాని మద్దతు కోరండి
ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు ఈనెల 13, 14 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టులో ఈ రిజర్వేషన్ అంశాలను సమర్థించేలా ప్రధానిని ఒప్పించాలని ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రిలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ కోరారు.
5.సౌదీ జైలులో జగిత్యాల వాసి మృతి

ఉపాధి కోసం తెలంగాణ నుంచి సౌదీ అరేబియా వెళ్ళిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడ చెందిన రాజయ్య అనే వ్యక్తి అక్కడి జైలులో మరణించారు.ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భారతీయ ఎంపీసీ అధికారులు అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
6.1569 ఎం ఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీ
గ్రామీణ ప్రాంతాల్లో 1220, పట్టణ ప్రాంతాల్లో 349 ఎం ఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది .
7.లిక్కర్ స్కాం పై ప్రగతి భవన్ లో సోదాలు జరగాలి

మద్యం ఇసుక భూములు ఇలా అన్ని మాఫియాలకు కేంద్రంగా ప్రగతి మారిందని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆధారాలు దొరకాలంటే, ప్రగతిభవన్ లో సిబిఐ, ఈడి సోదాలు జరగాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
8.నేడు నీట్ యూజీ ఫలితాలు
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
9.సీఎం కేసీఆర్ కు గుడి

మేడ్చల్లో మొదలుపెట్టి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ కు ఒక గుడి నిర్మించాలని భావిస్తున్నట్లు హైదరాబాద్ కు చెందిన శ్రీ షిరిడి సాయి బృందావన్ పీఠం వ్యవస్థాపక చైర్మన్ కేజే కిషోర్ కుమార్ ప్రకటించారు.
10.ఫీజులు తగ్గించకుంటే ఉద్యమం
పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించకపోతే ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
11.ఉపాధి కూలీలకు పరిహారం పెంపు

ఉపాధి హామీ కార్మికులు ప్రమాదాలకు గురైతే చెల్లించే పరిహారం పెంపును సూచిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభవృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య ఉత్తర్వులు జారీ చేశారు.
12.ఇంజనీరింగ్ ఫీజులపై మళ్ళీ సమీక్ష
ఈ ఏడాదికి సంబంధించి ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు పై మరోసారి సమీక్ష జరగనుంది.ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తాజాగా నిర్ణయించుకుంది.
13.రైతు సంక్షేమ కోసం అగ్రి డాట్ ఎక్సేంజ్

రైతుల సంక్షేమం పంట దిగుబడులను పెంచడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తో ఒప్పందం చేసుకుంది.
14.ఎన్టీఆర్ స్టేడియం ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మంత్రులు
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇతర అధికారులు పరిశీలించారు.
15.నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది.దీంతో అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
16.జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర రాజధాని అమరావతి, ఎన్నికల్లో పొత్తుల అంశంపై బీజేపీ ఎంపీ జిబిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర రాజధాని అమరావతికి బిజెపి కట్టుబడి ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
17.జగన్ ప్రభుత్వం పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

వైసిపి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచల వ్యాఖ్యలు చేశారు. వచ్చే వినాయక చవితి పండుగ తర్వాత జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉండదని జోస్యం చెప్పారు.
18.తెలంగాణ క్యాబినెట్ సమావేశం
ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు ప్రారంభమైంది సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ వన్ లో సమావేశం జరుగుతుంది.
19.ప్రభుత్వంతో చర్చలకు హాజరు కావడం లేదు
సిపిఎస్ పై ప్రభుత్వ చర్చలకు తాము హాజరు కావడంలేదని ఏపీ సిపి ఎస్ యు ఎస్ నేతలు సీఎం దాస్ రవికుమార్ స్పష్టం చేశారు.
20.చలో కావలికి బయలుదేరిన లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చలో కావలికి బయలుదేరి వెళ్లారు.లోకేష్ వెంట భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు కావలికి వెళ్లారు.