ఏపీలో అల్లర్ల ఘటనలపై డీజీపీకి సిట్ ప్రాథమిక నివేదిక

ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Election polling ) నేపథ్యంలో జరిగిన అల్లర్ల ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రాథమిక నివేదికను సిట్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta )కు అందజేసింది.

 Sit Preliminary Report To Dgp On Riots In Ap,ap Election Polling, Sit Preliminar-TeluguStop.com

ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ వాల్ నివేదికను డీజీపీకి అందించారు.కాగా రాష్ట్రంలో ఎన్నికల రోజుతో పాటు తరువాతి రోజు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు.

ఈ క్రమంలోనే మొత్తంగా 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్ అల్లర్ల ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ లను పరిశీలించింది.ఈ నేపథ్యంలోనే నమోదైన ఎఫ్ఐఆర్ లలో కొన్ని సెక్షన్ల మార్పుపై సిట్ సిఫార్సు చేసింది.

కాగా రాష్ట్రంలోని మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి మరియు తాడిపత్రి నియోజకవర్గాల్లో నిన్న అర్ధరాత్రి వరకు సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగింది.తరువాత సిట్ తన ప్రాథమిక నివేదికను సీఈవోతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube