టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రాజకీయ వ్యూహాలు ఆశామాషిగా ఉండవు. ఆయన ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక అనేక రాజకీయ వ్యూహాలు దాగి ఉంటాయి.
ఆ తరహా వ్యూహాలతోనే ఏపీలో టిడిపి పని అయిపోయిందని, ఇక గెలిచే అవకాశం లేదని అంత భావించినా చంద్రబాబు అనూహ్యంగా జనసేన ,బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చారు.ప్రస్తుతం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు టిడిపిలోకి వచ్చి చేరుతున్నారు.
తాజాగా వైసిపి( YCP ) నుంచి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలు టీడీపీకి దక్కడం కాయంగానే కనిపిస్తోంది .దీంతో ఈ రెండు స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా చంద్రబాబు ఎంపిక చేస్తారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఈ రెండు స్థానాలపై టిడిపి సీనియర్ నేతలు( Senior TDP leaders ) చాలామంది ఆశలు పెట్టుకోగా చంద్రబాబు మాత్రం ఈ రెండు స్థానాల్లో ఒకటి నందమూరి కుటుంబానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట.
![Telugu Ap, Janasena, Ntr, Ysrcp-Politics Telugu Ap, Janasena, Ntr, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/What-is-Suhasini-Chandrababus-strategy-for-Rajya-Sabhab.jpg)
ప్రస్తుతం టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కారణంగా అనేక సందర్భాల్లో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసినిని( Nandamuri Suhasinini ) రాజ్యసభకు పంపాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట .ప్రస్తుతం రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేదు .వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు.వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ రావు, బీద మస్తాన్ రావు ( Mopidevi Venkataramana Rao, Beda Mastan Rao )రాజీనామా చేశారు.
మరో రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంతో మరో రెండు రోజుల్లో దానిపై క్లారిటీ రానుంది .
![Telugu Ap, Janasena, Ntr, Ysrcp-Politics Telugu Ap, Janasena, Ntr, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/What-is-Suhasini-Chandrababus-strategy-for-Rajya-Sabhac.jpg)
ఈ మూడు సీట్లపై టిడిపి సీనియర్ నేతలు చాలామంది ఆశలు పెట్టుకున్నా. జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టే విధంగా నందమూరి సుహాసిని కి ఎంపీగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట .ప్రస్తుతం టిడిపి నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న నేతల చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర , పనబాక లక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తోపాటు, సీనియర్ నేతలు టిడి జనార్దన్, వర్ల రామయ్య లు ఉన్నారు.
నందమూరి సుహాసిని కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చామనే సంకేతాలు జనాల్లోకి వెళ్లడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం రాబోయే రోజుల్లో తమకు పెద్దగా ఇబ్బంది ఉండదు అని లెక్కల్లో చంద్రబాబు ఉన్నారట.