ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు.కొందరు హీరోలు చేతినిండా బోలెడు సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక హీరోలు నటించిన సినిమాలు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి.ఇప్పటికే కొందరు షూటింగ్ లు పూర్తిచేసుకుని చిత్రీకరణలు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
మరి కొన్ని సినిమాలో సెట్స్ పైకి ఎక్కడానికి సిద్ధమవుతున్నాయి.అలాగే త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న పలు భారీ ప్రాజెక్ట్‌లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎన్టీఆర్ ( NTR )ఇటీవలే తన 31వ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశారు.అయితే అక్టోబరు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది.
ఎన్టీఆర్ డిసెంబరు నుంచి చిత్రీకరణలో పాల్గొంటారని తెలిపింది.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం డ్రాగన్ ( Dragon )అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 కి కొనసాగింపుగా రూపొందిన పుష్ప 2 ( Pushpa2 )సినిమాను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఇప్పుడీ చిత్ర ప్రీమియర్లపైనా చిత్ర నిర్మాతల నుంచి స్పష్టత వచ్చేసింది.డిసెంబరు 5నే ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ అనుకున్నట్లుగా జరుగుతోందని సెప్టెంబరు 2నాటికి ప్రథమార్ధం ఎడిటింగ్ పూర్తి చేస్తామని అక్టోబరు 6కల్లా ద్వితీయార్ధం, నవంబరు 20నాటికి కాపీ పూర్తవుతుందని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు.నవంబరు 25కి సెన్సార్ పూర్తి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్లు చెప్పారు.సెప్టెంబరు నెలాఖరులో ఒకటి, అక్టోబరులో మరొక పాట విడుదల చేస్తామని స్పష్టత ఇచ్చారు.అలాగే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా( Kalki movie ) ఇటీవలే విడుదల అయ్యి 1000 కోట్లకు ఉపయోగ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది చిత్ర బృందం.
దీని చిత్రీకరణ విషయమై నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్ రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ఒక కొత్త కబురు పంచుకున్నారు.
ఈ సీక్వెల్ చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.చిత్రీకరణ ప్రారంభమయ్యాక దానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) నుంచి రావాల్సిన సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి.
హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో బిజీ బిజీ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిగా నిలిపివేశారు.అయితే మరికొన్ని వారాల్లో దీని చిత్రీకరణను పునఃప్రారంభించనున్నట్లు మైత్రీ మూవీస్ స్పష్టత ఇచ్చింది.
ఈ విషయమై ఇటీవలే పవన్ తో కలిసి మాట్లాడినట్లు వెల్లడించింది.డిసెంబరు, జనవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపింది.
అలాగే పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఈ చిత్రం నుంచి ఒక సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.