ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న ఒకే ఒక పేరు హేమా కమిటీ నివేదిక.( Hema Committee Report ) ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.
ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ఈ హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది.
మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య( problem of sexual harassment ) గురించి ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా మొత్తం మాట్లాడుకుంటోంది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఎత్తిచూపుతూ జస్టిస్ హేమ ప్యానెల్ నివేదిక విడుదలైంది.
దీంతో చాలా మంది నటీ మణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.మలయాళ చిత్ర సీమలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులపై లైంగిక ఫిర్యాదులు రావడం మొదలైంది.అయితే ఇప్పటికే కొందరు ధైర్యం చేసి ముందుకు వచ్చి పేర్లతో సహా బయట పెట్టేయగా మరి కొందరు బయటికి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు.అయితే నేపథ్యంలోనే మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ అధ్యక్ష పదవికి నటుడు మోహన్ లాల్ ( Actor Mohanlal )రాజీనామా చేశారు.
అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరూ అమ్మకు రాజీనామా చేశారు.హేమ కమిటీ విచారణ నివేదిక అందర్నీ విస్మయానికి గురిచేస్తే, మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేయడం కూడా షాక్ ఇచ్చింది.
అమ్మ సంస్థ నిర్వాహకుల ఈ చర్యపై నటి పార్వతి ( Actress Parvati )షాకింగ్ కామెంట్స్ చేసింది.నిరంతర లైంగిక ఫిర్యాదుల నేపథ్యంలో మలయాళ నటీనటుల సంఘం అమ్మ నుంచి మోహన్ లాల్‌తో సహా ఎగ్జిక్యూటివ్ లు రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని నటి పార్వతి విమర్శించారు.దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.ఈ వార్త వినగానే నేను షాక్ అయ్యాను.ఇది ఎంత పిరికితనం అంటే.ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు పిరికితనంతో బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు? అని ప్రశ్నించింది పార్వతి.మరి ఈ విషయంపై మోహన్ లాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.