రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి

తంగళ్లపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ హెచ్ సీ)ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 The Number Of Diagnostic Tests Should Be Increased , Diagnostic Tests, Collector-TeluguStop.com

ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఫార్మసీ, వ్యాక్సిన్ గది, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు.ఫిజియో థెరపీ సేవల రిజిస్టర్ తనిఖీ చేశారు.

రోజు ఓపీ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడారు.

దవాఖాన ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో రక్త పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలని సూచించారు.

సీసీ టీవీ మరమ్మత్తు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ఇక్కడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ, హోమియో డాక్టర్ డాక్టర్ దీప్తి, సిబ్బంది తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube