కొందరిలో హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది.ఇలాంటి వారికి ఊడే జుట్టు ఊడుతుంది.
కానీ, కొత్త వెంట్రుకలు మాత్రం రావు.దాంతో ఒత్తైన జుట్టు కాస్త పల్చగా తయారవుతుంది.
ఇటువంటి జుట్టుతో హెయిర్ స్ట్రైల్స్ వేసుకోవడం ఎంత కష్ణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పైగా తోక లాంటి జుట్టును చూసి ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు.
అందుకే హెయిర్ రీగ్రోత్ కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే ఊడిని జుట్టు మళ్లీ తిరిగి రావడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో వాటర్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ రైస్ వాటర్ చల్లారేలోపు మూడు మందారం పువ్వులు, ఐదారు మందారం ఆకులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మందారం పువ్వులు, మందారం ఆకులు, చల్లారబెట్టుకున్న రైస్ వాటర్ వేసి నాలుగైదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే ఊడిన జుట్టు తిరిగి మొలవడమే కాదు పల్చటి కురులు ఒత్తుగా, పొడవుగా మారతాయి.