మొటిమలు టీనేజ్ రాగానే ప్రారంభం అయ్యే ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.యుక్త వయసులో ఉన్న వారు పరీక్షలకైనా భయపడరు.
కానీ, మొటిమలంటే తెగ భయపడుతుంటారు.అందంగా, కాంతివంతంగా ఉండే ముఖంపై మొటిమలు వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలా అని హైరానా పడిపోతుంటారు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే మొటిమల సమస్య తగ్గడమే కాదు వాటికి ఎప్పటికీ దూరంగా కూడా ఉండవచ్చు.మరి ఈ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.
ఆలివ్ ఆయిల్ మొటిమలు రాకుండా చేయడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.రెగ్యులర్‌గా ఆలివ్ ఆయిల్‌ను ముఖాన్ని అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంలో పోర్స్ క్లోజ్ అవ్వకుండా కంట్రోల్ అవుతాయి.ఫలితంగా గాలి ఆడి మొటిమలు రాకుండా ఉంటాయి.
ఒకవేళ మొటిమలు ఉన్నా తగ్గుముఖం పడతాయి.అలాగే ముఖాన్ని రోజు నాలుగు లేదా ఐదు సార్లు అన్నా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మురికి, మలనాలు మరియు జిడ్డు పోయి మొటిమలు రాకుండా ఉంటాయి.
మొటిమలు రాకుండా ఉండాలటే జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, షుగర్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.అలాగే మొటిమలు రాకుండా ఉండాలంటే స్క్రబ్బింగ్ చాలా ముఖ్యం.అందువల్ల, ఒక బౌల్‌లో బియ్యం పిండి, చిటికెడు పసుపు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత వాటర్ చల్లి నెమ్మదిగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.
మొటిమలకు దూరంగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మేకప్‌ను పూర్తిగా తొలిగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.అలాగే ప్రతి రోజు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి మరియు రెగ్యులర్‌గా వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.
పోషకాహారం తీసుకోవాలి.ఇలా చేస్తే మొటిమలు రమన్నా రావు.