ప్రభాస్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్.. ఏంటంటే..?

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

 Prabhas Fans Worried About Salar Movie Singareni Sentiment,salar Movie,prbhas,si-TeluguStop.com

కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కేజీఎఫ్ 2 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఒక సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను భయాందోళనకు గురి చేస్తోంది.

సలార్ సినిమా సింగరేణి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే గతంలో ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న కొన్ని తెలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా ఈ సెంటిమెంట్ భయం వెంటాడుతోంది.గతంలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమా సింగరేణిలో షూటింగ్ జరుపుకుంది.

ఎ కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ సింగరేణి గనుల్లో షూటింగ్ జరుపుకోగా బాలకృష్ణ సింగరేణి కార్మికుడిగా సినిమాలో కనిపించారు.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా కూడా సింగరేణి గనుల్లో షూటింగ్ జరుపుకుంది.

ఈ సినిమాలో రానాకు జోడీగా ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ నటించారు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

Telugu Nippuravva, Prabhas Fans, Salar, Singareni, Lover-Movie

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ కూడా సింగరేణి గనుల్లో జరుగుతోంది.క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.ప్రభాస్ సలార్ సినిమా ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube