సాధారణంగా మనం ఆనియన్ పకోడా, మిర్చి పకోడా ఇలా పలు రకాల పకోడాలను మనం నిత్యం ఫుడ్ స్టాల్స్ లో చూస్తూనే ఉంటాం.ఇకపోతే సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ ప్రదేశాలలో, వివిధ దేశాలలో ప్రజలు తినే వివిధ ఆహార అలవాట్ల గురించి ఎన్నో రకాల వీడియోలను మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.
అయితే., మీరు ఎప్పుడైనా కానీ పాము పకోడాలను( Snake pakodas ) చూశారా.? కనీసం విన్నారా.? అవును మీరు విన్నది నిజమే.ఆ ఫుడ్ స్టాల్ వద్ద పాము పకోడీలను తయారు చేయడంతో పాటు సేల్ కూడా చేస్తాడు.పాము పకోడీల వీడియోలను చూసి నెటిజన్స్ షాక్ కు గురైవుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కోబ్రా పకోడాలను( Cobra Pakodas ) తినడానికి ప్రజలు చాలా ఉత్సాహంగా ఆ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తున్నారు.అంతేకాకుండా ఆఫీస్ స్టాల్ వద్దకు చాలామంది పాము రక్తాన్ని తాగడానికే కూడా వస్తారట.అలా పాము రక్తాన్ని తాగడంతో వాళ్ళ రోగనిరోధక శక్తిని ( Immunity )పెంచుకోవడంతో పాటు చర్మాన్ని కూడా సౌందర్యవంతంగా చేసుకోవచ్చట.
ఈ క్రమంలో ఆ ఫుడ్ స్టాల్ వద్ద ఒక పెద్ద బోను కూడా ఉంది.ఆ బోనులో బతికి ఉన్న పాములు కూడా ఉండడం విశేషం.ఇక అక్కడ.ఒక్కో పాము దాదాపు రెండు లక్షలు ఇండోనేషియన్ ( Indonesian )రూపాయలట.
అయితే మన భారతీయ కరెన్సీలో 1000 రూపాయలన్నమాట.
ఇక ఎవరైనా ఆర్డర్ చేస్తే ఆ బోన్ లో నుంచి పాములు తీసి స్నాక్స్ తయారుచేసి సదరు వ్యక్తి ఇస్తారట.అంతేకాకుండా ఆ ఫుట్ స్టాల్ వద్ద పాములతో పకోడీలు, ఇంకా పాము మెమోస్ కూడా తయారు చేస్తాడట.ఇక ఈ వీడియోను చూసిన కొంత మందిని నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తూ స్నేక్స్తో స్నాక్స్, మోమోస్ తింటే.
ఇకపై కోబ్రా వైరస్ వస్తుంది.`హర హర మహాదేవ్.అంటూ కామెంట్ చేసారు.