చుండ్రు.స్త్రీలే కాదు ఎందరో పురుషులు సైతం దీని బాధితులుగా ఉంటూ ఎంతో వేదనను అనుభవిస్తున్నారు.సాధారణంగా చుండ్రు ఒక్కసారి పట్టుకుందంటే ఓ పట్టాన వదలదు.పైగా ప్రస్తుత వర్షాకాలంలో చుండ్రు మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే దాన్ని నివారించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్‌లో ఉంటే.
అస్సలు చింతించకండి.ఎందుకంటే, అందరి ఇళ్లల్లో ఉండే ఆవాలతోనే చుండ్రుకు సులభంగా బై బై చెప్పొచ్చు.
మరి అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి.
అర నిమిషం పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ఆవాలు పూర్తిగా చల్లారక.
మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి ఉల్లిపాయ జ్యూస్‌ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆవాల పొడి, ఐదారు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, వన్ ఎగ్ వైట్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు మొత్తానికి పట్టించి.షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఆవాలతో ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఎంత తీవ్రమైన చుండ్రు అయినా పరార్ అవ్వాల్సిందే.
చుండ్రుతో తీవ్రంగా మదన పడుతున్నవారు.తరచూ షాంపూలు మార్చడం మానేసి ఈ రెమెడీని పాటిస్తే మంచి ఫలితం మీసొంతం అవుతుంది.