బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ ఎవరన్నది లీక్ అయ్యింది.బిగ్ బాస్ షో ఈసారి 24/7 లైవ్ ఇవ్వడం వల్ల నైట్ షో టెలికాస్ట్ అవడానికి ముందే షోలో జరిగే విషయాలు బయట వచ్చేస్తున్నారు.
ఇల ఈరోజు హౌజ్ లో కెప్టెన్సీ పోటీ జరుగుతుంది.కెప్టెన్సీ పోటీలో 21 మంది నుంచి ఆరుగురు హౌజ్ మెట్స్ పోటీ పడుతున్నారు.
ఇక ఈ కెప్టెన్సీ ఫైట్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో బాలాదిత్య గెలిచినట్టు తెలుస్తుంది.సో బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో మొదటి కెప్టెన్ గా బాలాదిత్య నిలిచారు.
హౌజ్ లో ఇప్పటికే ఆయన శాంతిపరుడుగా పేరు తెచ్చుకోగా ఇక కెప్టెన్ గా అతను గెలవడం అతని ఆటని మరింత పెంచేలా చేస్తుంది.అంతేకాదు బాలాదిత్య కూల్ నెస్ కి బిగ్ బాస్ ఆడియెన్స్ సూపర్ అనేస్తున్నారు.
ఇప్పటివరకు హౌజ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని బాలాదిత్య కన్ విన్స్ చేయడానికి ప్రయత్నించాడు.మరి బాలాదిత్య ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం ఈ సీజన్ విన్నర్ గా కూడా నిలిచే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పటికే బిగ్ బాస్ ఆడియెన్స్ నుంచి మిస్టర్ కూల్ అనే ట్యాగ్ ని తెచ్చుకున్నాడు బాలాదిత్య.







