తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాలలో.. భక్తులు ధరించే దుస్తుల రంగుల గురించి తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి మొదలవుతాయన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు.నవరాత్రులలో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీ అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

 Significance Of Nine Colours Of Navratri For Home, Nine Colours , Navratri ,dasa-TeluguStop.com

అయితే పూజా సమయంలో భక్తులు ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమైన రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.మరి ఏ రంగు దుస్తులను ఎప్పుడు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా మొదటి రోజు నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రీ దేవిగా పూజిస్తారు.శైలపుత్రీ దేవికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం.

Telugu Navratri, Dasara, Colours-Latest News - Telugu

అందువల్ల మొదటి రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం అదృష్టమని చెబుతూ ఉంటారు.అలాగే రెండో రోజు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవిని దేవి బ్రహ్మచారిణిగా పూజిస్తారు.ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.అలాగే మూడవ రోజు బ్రౌన్ కలర్ దుస్తులు ధరించడం వల్ల భక్తులు అదృష్టంగా భావిస్తారు.

నాలుగవ రోజు నవరాత్రి ఉత్సవాలలో నారింజ రంగు దుస్తులను ధరించడం వల్ల జ్ఞానం, ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు.ఐదవ రోజు తెల్లని దుస్తులను ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.


Telugu Navratri, Dasara, Colours-Latest News - Telugu

ఆరవ రోజు దుర్గాదేవిని కాత్యాయనీ దేవిగా పూజిస్తారు.ఈ రోజున భక్తులు ఎర్రటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే ఏడవ రోజున నీలం రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఎనిమిదవ రోజున గులాబీ రంగు దుస్తులను ధరించి అమ్మ వారిని పూజించడం మంచిది.

అలాగే 9వ రోజు నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని సిద్ధి ధాత్రి దేవిగా పూజిస్తారు.సకల సిద్దుల పుత్రిక ఆయన సిద్ధి ధాత్రి పూజకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది.

ఈ రోజున ఊదా రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube