ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం 06.15
రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ12.00 ల12.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 మ.12.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.
విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బులు చేతి పందుతుంది.
మిథునం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి.ఇరుగు పొరుగు వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కన్య:

ఈరోజు మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.దీని వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.
మకరం:

ఈరోజు మీరు తీరికనేని సమయంతో గడుపుతారు.ఎప్పటి నుండో వాయిదా పడిన పనులన్నీ స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.భవిష్యత్తులో పెట్టబడునుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
కుంభం:

ఈరోజు మీలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది.కొందరి ప్రవర్తన మీ మనసులో బాధను కలిగిస్తుంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
అతిగా ఖర్చులు చేయడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
మీనం:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.ఊహించని వ్యక్తుల పరిచయం మీలో సంతోషాన్ని కలిగిస్తుంది.
DEVOTIONAL