శ్రీరాముడికి ఇష్టమైన పానకం వడపప్పు ప్రసాదాల ఆరోగ్య రహస్యం ఇదే..

పానకం, వడపప్పు శ్రీరామ నవమి( Sri Rama Navami ) రోజున శ్రీ రాముడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.అందులో శ్రీరాముడికి ఇష్టమైన ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి భారతీయులు జరుపుకునే పండుగలలో చేసుకునే ప్రసాదాలు, పిండి వంటలు ఆయా కాలంలో వచ్చే వ్యాధులను దరిచేరినివ్వకుండా ఉంటాయని ప్రజలు నమ్ముతారు.

 This Is The Health Secret Of Lord Rama's Favorite Drink Vadappu Prasad , Vadappu-TeluguStop.com

అటువంటిదే ఎండాకాలం ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగ సమయంలో చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఉంటుంది.అంతే కాకుండా ఉగాది పండుగ తర్వాత వచ్చే శ్రీరామ నవమి పండుగ తయారు చేసుకునే రామయ్య కు నైవేద్యంగా పెట్టే ‘పానకం,వడపప్పు ప్రసాదాలలో కూడా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.

శ్రీరామనవమి ఎంత విశిష్టమైనదో రామయ్య కు నైవేద్యంగా సమర్పించే పానకం, వడపప్పు కూడా అంతే విశిష్టమైనవి.మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ప్రసాదాలలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామనవమి ఎండాకాలంలో మొదలవుతుంది.

Telugu Bhakti, Devotional, Lord Rama, Sri Rama Navami, Vadappu Prasad-Telugu Bha

అందువల్ల శ్రీరాముని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు బెల్లం తో పానకం తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ప్రజలకు పంచుతారు.ఆరోగ్యం అంటే తినరేమో కానీ దేవుడి ప్రసాదం అంటే కచ్చితంగా తింటారు.అందుకే మన పూర్వికులు ఇలాంటి సంప్రదాయాలను ఏర్పాటు చేశారు.

ఇంకా చెప్పాలంటే శ్రీరామనవమి రోజు ముఖ్యమైన ప్రసాదం పానకం.ఈ పానకంలో ఉపయోగించే మిరియాలు,ఏలకులు వసంత కాలంలో వచ్చే గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

అలాగే పానకమే కాకుండా వడపప్పు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వడ పప్పు అంటే పెసరపప్పుని నానబెట్టి అందులో వసంతకాలంలోనే మామిడికాయల( Mangoes ) తురుముని కలుపుతారు.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అంతేకాకుండా ఇది జీర్ణం వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.ఇంకా చెప్పాలంటే పెసరపప్పు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పెసరపప్పు వడదెబ్బ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube