ముని, ఋషి, యోగి, సాధువు అంతా ఒకటేనా?

మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది సాధువులు, సన్యాసులు, మునులు, రుషులు, యోగులు ఉంటారు.అయితే వీరందరూ ఒకటేనని చాలా మంది అనుకుంటారు.

 Muni, Rushi, Yogi And Sadhuvu All Are Same Or Not , Munulu , Rushulu , Sadhuvulu-TeluguStop.com

కానీ వీరంతా ఒక్కటి కాదు.కాకపోతే మనకు తెలియక వాళ్లంతా ఒకటే అనుకుంటాం.

ముని, ఋషి, యోగి, సాధువులకు తేడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే వారు ఏం చేస్తారో కూడా చూద్దాం.

1.మన్యతే ఇతి మునిః అను వ్యుత్పత్తినిబట్టి ‘ముని‘ అనే శబ్దం ఏర్పడింది.‘మనజ్ఞానే’ అని ధాతువు.జ్ఞానం కలవాడు అని ఆ శబ్దానికి అర్ధం.మౌనవ్రతం పాటించేవాని పేరుగా అమరకోశం పేర్కొన్నది.

2.ఋషి : ‘జ్ఞానస్య పారమగాత్ ఇతి ఋషిః’ అను వ్యుత్పత్తి ప్రకారం జ్ఞానము యొక్క ఆవలి గట్టును చేరిన వాడు ‘ఋషి’ అవుతాడు.సత్య వాక్కు.(సత్యం చెప్పే వాడు) అనునది దీని పర్యాయ పదం.

3.యోగి : యోగః అస్యాస్తతి యోగీ యోగం కలవాడు యోగి అనబడ తాడు.యోగ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి.

యోగ శ్చిత్త  వృత్తి నిరోధః అని పతంజలి యోగ సూత్రము ననుసరించి మనో వృత్తిని నిరోధించడం యోగం.కర్మ యోగం, భక్తి  యోగం, జ్ఞాన యోగం అన్న వ్యవహారం కూడా ప్రసిద్ధం.కాబట్టి ఆయా యోగాలను అనుష్ఠించేవాడు ‘యోగి’ అవుతాడు.

4. సాధువు : ‘సాధ్నోతీతి సాదుః’ (సాధ సంసిధౌ అని ధాతువు) కార్యాన్ని సాధించే వాడు సాధువు.‘సజ్జనుడు’ అనే అర్థంలో కూడా ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube