ఇంటి ఏ మూల పెరిగితే అదృష్టమో తెలుసా..!

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు.

 Do You Know Which Corner Of The House Is Lucky ,vastu Shastram ,corner Of The Ho-TeluguStop.com

ఇందులో భాగంగా వాస్తు లో లోపం ఉంటే ఇబ్బందులు వస్తాయని వారి నమ్మకం.వాటిని అధిగమించడానికి ప్రజలు చర్యలు తీసుకుంటూ ఉంటారు.

లేదంటే తిప్పలు తప్పవు అని వారికి బాగా తెలుసు.ఇంటిలోకి దరిద్రం రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్ర రీత్యా మనకు నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉన్నాయి.తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కులు.

ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం నాలుగు దిశలు.దీంతో ప్రతి ఇంటికి కూడా నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉండడం సహజమైన విషయమే.

మనం ఇల్లు నిర్మించుకునే స్థలాన్ని బట్టి ఏ మూల ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.స్థలానికి ఉండే దిక్కులను బట్టి వీధిని నిర్ణయిస్తారు.

Telugu Southeast, Southwest, Vastu, Vastu Shastram, Vastu Tips-Telugu Raasi Phal

వీధిని బట్టి స్థలానికి ఉండే హెచ్చుతగ్గుల నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది.ఆగ్నేయం విషయంలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, తూర్పులో తూర్పు ఆగ్నేయం, దక్షిణా ఆగ్నేయం, నైరుతి దిశలో పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, పశ్చిమ కు దక్షిణా నైరుతి, పశ్చిమ నైరుతి వాయువ్యం లో, ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యము, ఉత్తర పశ్చిమ వాయువ్యం, ఈశాన్య దిశలలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఉత్తర ఈశాన్యం ఇలా మూడు రకాల మూలలు ఉంటాయి.

Telugu Southeast, Southwest, Vastu, Vastu Shastram, Vastu Tips-Telugu Raasi Phal

ఏ మూల పెరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.దక్షిణ ఆగ్నేయ మూల పెరిగితే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.తూర్పు ఆగ్నేయం పెరిగితే సంతాన నష్టం కలుగుతుంది.తూర్పు దక్షిణం ఆగ్నేయం పెరిగితే సంతానంతో పాటు వ్యాపారంలో లాభం వస్తుంది.అంతే కాకుండా కోర్టు కేసులు, న్యాయస్థానాల చుట్టూ తిరుగువాల్సి ఉంటుంది.దక్షిణ నైరుతి పెరిగితే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పశ్చిమ నైరుతి పెరిగితే చెడ్డవారితో స్నేహాలు, వ్యాపారంలో నష్టాలు వస్తాయి.దక్షిణ పెరిగితే శత్రువుల సమస్యలు పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube