ఇంటి ఏ మూల పెరిగితే అదృష్టమో తెలుసా..!

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.

ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు.ఇందులో భాగంగా వాస్తు లో లోపం ఉంటే ఇబ్బందులు వస్తాయని వారి నమ్మకం.

వాటిని అధిగమించడానికి ప్రజలు చర్యలు తీసుకుంటూ ఉంటారు.లేదంటే తిప్పలు తప్పవు అని వారికి బాగా తెలుసు.

ఇంటిలోకి దరిద్రం రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్ర రీత్యా మనకు నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉన్నాయి.తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కులు.

ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం నాలుగు దిశలు.దీంతో ప్రతి ఇంటికి కూడా నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉండడం సహజమైన విషయమే.

మనం ఇల్లు నిర్మించుకునే స్థలాన్ని బట్టి ఏ మూల ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్థలానికి ఉండే దిక్కులను బట్టి వీధిని నిర్ణయిస్తారు. """/"/ వీధిని బట్టి స్థలానికి ఉండే హెచ్చుతగ్గుల నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది.

ఆగ్నేయం విషయంలో తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, తూర్పులో తూర్పు ఆగ్నేయం, దక్షిణా ఆగ్నేయం, నైరుతి దిశలో పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, పశ్చిమ కు దక్షిణా నైరుతి, పశ్చిమ నైరుతి వాయువ్యం లో, ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యము, ఉత్తర పశ్చిమ వాయువ్యం, ఈశాన్య దిశలలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఉత్తర ఈశాన్యం ఇలా మూడు రకాల మూలలు ఉంటాయి.

"""/"/ ఏ మూల పెరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.దక్షిణ ఆగ్నేయ మూల పెరిగితే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.

తూర్పు ఆగ్నేయం పెరిగితే సంతాన నష్టం కలుగుతుంది.తూర్పు దక్షిణం ఆగ్నేయం పెరిగితే సంతానంతో పాటు వ్యాపారంలో లాభం వస్తుంది.

అంతే కాకుండా కోర్టు కేసులు, న్యాయస్థానాల చుట్టూ తిరుగువాల్సి ఉంటుంది.దక్షిణ నైరుతి పెరిగితే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పశ్చిమ నైరుతి పెరిగితే చెడ్డవారితో స్నేహాలు, వ్యాపారంలో నష్టాలు వస్తాయి.దక్షిణ పెరిగితే శత్రువుల సమస్యలు పెరుగుతాయి.

పొట్ట కొవ్వును కరిగించే గ్రీన్ యాపిల్.. ఎలా తీసుకోవాలంటే..?