పురాతన ఆచార వ్యవహారాలకు సంస్కృతులకు ప్రతిబింబం ఈ జాతర.ఈ జాతరలను ఒక్క ప్రదేశంలో ఒక్కోలా నిర్వహించడం పూర్వం ప్రజల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతర ప్రత్యేకం బూతులు తిట్టడం.తిరుపతిలో గత నాలుగు రోజులుగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి( Sri Tataya Gunta Gangamma’s talli ) జాతర నిర్వహిస్తున్నారు.7 రోజులపాటు జరిగే ఈ జాతరలో రకరకాల వేషాలలో బూతులు తిడుతూ కనబడుతూ ఉంటారు.ఈ జత్రను రాష్ట్ర జాతరగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ జాతర చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గతంలో తిరుపతి ( Tirupati )ప్రాంతంలో పెద్ద పాలెగాడు ఉండేవాడు.
అతను స్త్రీలోలుడు, స్త్రీ కనపడితే ఆమెను అనుభవించే వరకు వదిలేవాడు కాదు.అతని ఆగడాలు శృతిమించినా అడ్డు చెప్పేందుకు అందరూ భయపడేవారు.
ఒకసారి అతను తన చెలికత్తెలతో వస్తున్నప్పుడు ఏటి గట్టున్న గంగమ్మను చూసి మోహించాడని చెబుతున్నారు.దాంతో గంగమ్మ వారం రోజుల్లో పాలెగాడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసింది.
అక్కడున్న వారు ఆమె మహిమగలదనీ ఆమె జోలికి ఎందుకు వెళ్ళావని ప్రజలు పాలెగాడికి చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయాడు.ఎలాగైనా పాలెగాడినీ బయటకు వచ్చేలా చేయాలని వివిధ వేషాలలో గంగమ్మ బూతులు తిడుతూ తిరిగేదట.మొదటి రోజు బైరాగిలా, రెండో రోజు బండలా, మూడవరోజు తాటిల, నాలుగో రోజు దొరల, ఐదో రోజు మాతంగిలా, ఇలా ఆరో రోజు సున్నపు కొట్టంలా, ఏడవ రోజు సప్పరాల వేషంలో గంగమ్మ తిరుగుతూ అతడిని సంహరించిందట.అతని పీడా విరగడవడంతో ఊరంతా సంబరాలు చేసుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే స్వయానా వెంకటేశ్వర స్వామి( Lord Venkateswara ) చెల్లెలు అయిన గంగమ్మను అప్పటినుంచి ప్రజలు పూజించడం ప్రారంభించారు.తిరుపతి ఆడ బిడ్డగా గంగమ్మను ప్రజలు భావిస్తారు.పూర్వం రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ జాతరను కనులారా చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.జాతరలో గంగమ్మ వేషాలతో కళాకారులు కనబడుతూ ఉంటారు.ఏడు రోజులు గంగమ్మ వేసిన వేషలలో కనిపిస్తూ బుతులు తిడుతూ ఉంటారు.ఇక్కడ బయటపడిన ఆలయ స్తంభాలను బట్టి పల్లవుల నాటివని చరిత్రకారులు చెబుతున్నారు.
DEVOTIONAL