కన్నతల్లి ప్రేమ( Mothers love ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
అందులోనూ తల్లి వారిని ప్రతినిముషం కనిపెట్టుకుంటూ ఉంటుంది.వారికోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది.
దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.ఇక తాజాగా భారీవర్షంలో కాళ్లకి చెప్పులు లేకపోయినా కూతుర్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో వైరల్ అవుతోంది.
మే 14న ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్స్ డే’ ( Mothers Day )సెలబ్రేట్ చేసుకున్న విషయం అందరికి తెలిసినదే.అదే రోజు ఇంటర్నెట్‌లో కనిపించిన ఓ వీడియో నెటిజన్ల మనసుల్ని హత్తుకుంది.18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని మాస్టర్ జి యూపీ వాల్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా అదికాస్త వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే, తల్లి కూతురిని భుజాలపై మోస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.
భారీ వర్షంలో ఆమె తుడుచుకుంటూ తన కూతురిని తడవకుండా తీసుకెళ్తున్న తీరు పలువురిని అవాక్కయేలా చేసింది.
తన కాళ్లకు చెప్పులు లేకపోయినా కూతురితో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఆ తల్లి ప్రేమను చూసి నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ రాగా ఇంకా నెట్టింట దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం ఇక్కడ మనం చూడవచ్చు.‘వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉందని.ఆ తల్లి చిరునవ్వులు చూడమని‘ కొందరు కామెంట్లు చేస్తే, బిడ్డలు కబుర్లు చెబుతూ ఉంటే ప్రతి తల్లి తన కష్టాన్నే మర్చిపోతుంది… అని కొందరు కామెంట్ చేస్తున్నారు.