వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా... ఈ పరిహారం చేయాల్సిందే!

సాధారణంగా ఎంతోమంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతుంటారు.అయితే వారి జాతక దోషం ప్రభావం కారణంగా చాలామందికి ఎన్నో సంబంధాలు ఉన్నప్పటికీ అవి మాత్రం కుదరక పెళ్లి ఆలస్యం అవుతుంది.

 Are There Any Obstacles To The Marriage This Has-to Do Marrige,  Problems,  Solu-TeluguStop.com

ఈ విధంగా ఎన్ని సంబంధాలు చూసినా చాలామందికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, ఒకవేళ కుదిరిన పెళ్లికి ఎన్నో అడ్డంకులు ఏర్పడటం వల్ల చాలామంది పెళ్లి పీటలు ఎక్కలేక పోతున్నారు.ఇలా మాటి మాటికి వివాహానికి అడ్డంకులు ఏర్పడేవారు ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల వివాహానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అలాంటి యువతీ యువకులు వారి పడక గదిలో మంచం విషయంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి.పెళ్లి కాని యువతి ఇంటిలో ఎల్లప్పుడూ కూడా వాయువ్య దిశలో నిద్ర పోవాలి.

అదేవిధంగా పెళ్లి కాని యువకుడు ఈశాన్య దిశలో నిద్రపోవటం వల్ల వీరికి తొందరగా పెళ్లి గడియలు దగ్గరికి వస్తాయి.ఇక పెళ్ళి కాని వారు ఇంటిలో మంచం కింద ఏ విధమైనటువంటి ఇనుప వస్తువులను ఉంచకూడదు.

ఇలా ఉంచడం వల్ల ఆ గది మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్ళికాని యువతీ యువకులు పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు.ఇలా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి.నలుపు రంగు వివాహానికి అడ్డంకులుగా ఉన్నటువంటి శని, రాహువు, కేతువులను సూచిస్తుంది.

కనుక ఈ రంగు దుస్తులను ధరించడం మంచిది కాదు.వీలైనంత వరకు ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు ధరించడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube